‘లవ్‌టుడే’ ‘డ్రాగన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూడ్’. కీర్తిశ్వరన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. మమిత బైజు కథానాయిక.
శనివారం ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో ప్రదీప్‌రంగనాథన్ చేతిలో మంగళసూత్రం పట్టుకొని ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు.