Dude First look | లవ్ టుడే, రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్ చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ని సాధించారు హీరో ప్రదీప్ రంగనాథన్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఆయనతో ‘డ్యూడ్’ పేరుతో ఓ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నదంటే కారణం అదే. ‘ప్రేమలు’ఫేం మమిత బైజూ ఇందులో కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకుడు. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
శనివారం విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్‌లుక్‌కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆదివారం కథానాయిక మమితా బైజుకు సంబంధించిన లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రదీప్‌కు పర్ఫెక్ట్ జోడీగా మమితా బైజు కనిపిస్తున్నది. ఒకవైపు ప్రదీప్ స్మైల్‌తో రిలాక్స్‌గా కనిపిస్తుంటే.. మమిత ైస్టెలిష్ దుస్తులు ధరించి, గాగుల్స్‌తో ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇస్తున్నది.
షూటింగ్ శరవేగంగా జరుగుతున్నదని, దీపావళి కానుకగా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.