Krithi Shetty | ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన మంగళూరు సోయగం కృతిశెట్టికి..ఆ తర్వాత చేసిన సినిమాలేవీ కలిసి రాలేదు. అయితే తమిళంలో మాత్రం సత్తా చాటుతున్నది. తాజాగా ఈ భామ అక్కడ భారీ అవకాశాన్ని దక్కించుకుంది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథ్తో కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించబోతున్నది. అగ్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు.
గురువారం చెన్నైలో ఈ సినిమా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకమని, పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని కృతిశెట్టి చెప్పింది. రామ్ నటించిన ‘ది వారియర్’ చిత్రంతో తమిళ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి అక్కడ చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది. కార్తి, జయం రవి వంటి అగ్ర హీరోల చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.