ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మై డియర్ భూతం’. ఈ చిత్రంలో ఆయన జీని పాత్రలో కనిపించనున్నారు. ఎన్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉండనుంది. పిల్లలకు బాగా నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. జీని పాత్రలో ప్రభుదేవా లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. రమ్య నంబీశన్, సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : యూకే సెంథిల్ కుమార్, సంగీతం : డి ఇమ్మాన్.