ప్రభాస్ ప్రస్తుతం వెకేషన్‌కు విదేశాలకు వెళ్లారు. రెండు మూడు రోజుల్లో తిరిగిరానున్నట్టు సమాచారం. సంక్రాంతి అనంతరం ఆయన ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. ఇదిలావుంటే.. మరోవైపు దర్శకుడు నాగ్అశ్విన్ ‘కల్కి 2’ను మొదలుపెట్టబోతున్నారట. ఫిబ్రవరి చివర్లో గానీ, మార్చి తొలివారంలో గానీ ‘కల్కి 2’ సెట్స్‌కి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే.. ఈ షెడ్యూల్లో ప్రభాస్ లేని సన్నివేశాలను నాగ్అశ్విన్ తీస్తారట. కమల్, అమితాబ్‌లతోపాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలిసింది. మే నుంచి ప్రభాస్ కూడా జాయిన్ అవుతారట. ఇక హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’కి సంబంధించిన తన పార్ట్‌ని ప్రభాస్ దాదాపుగా పూర్తి చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాగే వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలు (స్పిరిట్, కల్కి2)విడుదల ఉండేలా ప్లాన్ చేస్తున్నారట పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్. ఇక 2028లో ‘సలార్ -సౌంర్యాగపర్వం’ ఎలాగూ ఉంది..