Unstoppable-2 | అఫిషియల్.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్-2లో ప్రభాస్.. వీడియో వైరల్
గత కొన్ని రోజులుగా ప్రభాస్ అన్‌స్టాపబుల్ షోకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆహా సంస్థ ఈ వార్తలను నిజం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. త్వరలోనే బాహుబలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రభాస్, బాలకృష్ణ సినిమాల్లోని కొన్ని సీన్లతో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Unstoppable Season-2 |నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ టాక్‌షోకి ప్రభాస్ రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే నిజం చేస్తూ తాజాగా ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది.
త్వరలోనే బాహుబలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రభాస్, బాలకృష్ణ సినిమాల్లోని కొన్ని సీన్లతో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్‌తో పాటు గోపిచంద్ రానున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ షోకు రానుండటంతో ఎలాంటి విషయాలను బాలయ్య అడుగుతాడో అని ప్రేక్షకులు ఆత్రుత మొదలైంది. అంతేకాకుండా ప్రభాస్-గోపిచంద్ ఫ్రెండ్షిప్ గురించి కూడా బాలయ్య పలు విషయాలను అడుగనున్నట్లు టాక్. ఆదివారం చిత్రీకరణ జరుపకుంటున్న ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్-గోపిచంద్ ఇద్దరు కలిసి ‘వర్షం’ సినిమాలో తొలిసారిగా నటించారు. అప్పటి నుండి వీరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. గోపిచంద్ పలు ఇంటర్వూలలో కూడా ప్రభాస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇక వీరిద్ధరూ కలిసి మొదటి సారిగా ఒక టాక్ షోకు రానుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇక గోపిచంద్ కూడా తన ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుతుపుతున్నాడు.
The Bahubali episode #Unstoppable Season 2 is coming soon 😉
Watch out for more updates ✌🏻#UnstoppableWithNBKS2 #NBKOnAHA #NandamuriBalakrishna @PrabhasRaju #NBKWithPrabhas #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india pic.twitter.com/yDW1T5NypP— ahavideoin (@ahavideoIN) December 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

