Mirai Movie | తేజ సజ్జ హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమాలో ప్రభాస్ డబ్బింగ్ చెప్పినట్లు వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై క్లారిటీనిచ్చారు మేకర్స్. ఏఐ సాయంతో ప్రభాస్ వాయిస్‌ను తీసుకుని డబ్బింగ్ చెప్పినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మిరాయ్’ సినిమా ప్రారంభంలో వచ్చే ఒక ముఖ్యమైన ఎపిసోడ్‌కు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే, ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పకుండా, ఆయన అనుమతితో AI సాంకేతికతను ఉపయోగించి ఆయన వాయిస్‌ని సృష్టించి డబ్బింగ్ చెప్పించారు. అయితే ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాకి కొత్త వైబ్‌ని తెచ్చిందని.. ఇది సినిమాకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.