అగ్ర హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ జూన్‌లో విడుదలకు సిద్ధమవుతుండగా..మరో మూడు చిత్రాలు సెట్స్మీదున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ ైక్లెమాక్స్ ఘట్టాలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.
మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సూపర్‌హీరో యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్-కె’ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి చిత్రం ‘స్పిరిట్’ మీద దృష్టి పెట్టబోతున్నట్లు తెలిసింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ హంగులతో తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే బాలీవుడ్లో ‘యానిమల్’ షూటింగ్ పూర్తి చేసుకున్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘సిర్పిట్’ సినిమా ప్రీ ప్రొడక్షన్స్‌పై దృష్టి పెట్టారని తెలిసింది. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.