ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్’ కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రభాస్ ఇప్పటివరకు చేయని రొమాంటిక్, హారర్ జోనర్ కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తినెలకొని ఉంది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసి గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకొని సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను వెల్లడించనున్నారు.
ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ అల్ట్రా ైస్టెలిష్గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇంతకుముందెప్పుడూ చూడని రొమాంటిక్ అవతారంలో కనిపిస్తారని, అభిమానులకు పండగలా దర్శకుడు మారుతి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడని మేకర్స్ తెలిపారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, రచన-దర్శకత్వం: మారుతి.