Prabhas – Raaja Saab | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ (Raaja Saab). మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్05 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేయబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ను దసరా కానుకగా.. అక్టోబర్ 01 న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సప్తగిరి వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీనుతో పాటు బొమ్మన్ ఇరానీ తదితరులు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.