Multi Starrer | ‘ధురంధర్ 2’ ఘన విజయం తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి, రికార్డుల సునామీ సృష్టించడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను కలిపి పాన్ ఇండియా స్థాయిలో ఇండియన్ సినిమాను షేక్ చేసేలా ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ చిత్రంలో ప్రభాస్,సూర్య కలిసి నటించబోతున్నారని బాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ హై వోల్టేజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని టాక్. ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో వారి పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉండేలా పవర్ఫుల్ క్యారెక్టర్స్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. కథ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉండి, దేశ విదేశాల్లోని పలు ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా మార్కెట్, సూర్యకు ఉన్న నటనా ప్రతిభ ఈ రెండు కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా మధ్య మంచి బ్యాలెన్స్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్తలు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రభాస్, సూర్య కాంబినేషన్ నిజమైతే ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఇప్పటికే అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ఫౌజీ చిత్రంతో పాటు సలార్ మూవీపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.