Prabhas – Don lee | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’(Spirit) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా.
శనివారం ఒక మూవీ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మతో పాల్గోన్న దర్శకుడు సందీప్ ఈ వేడుక అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘స్పిరిట్’ సినిమా గురించి పంచుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందని అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని సందీప్ తెలిపాడు. అయితే ఈ చిత్రంలో కొరియన్ నటుడు డాన్ లీ నటించబోతున్నాడు అని వస్తున్న వార్తలపై సందీప్ స్పందస్తూ.. అన్ని అప్డేట్స్ సంక్రాంతికి ఇస్తాను అంటూ చెప్పుకోచ్చాడు. ప్రభాస్ పోలీస్ గెటప్ త్వరలోనే వస్తుంది. అప్పటివరకు వెయిట్ చేయండి అంటూ చెప్పుకోచ్చాడు.
#Spirit shoot twaralo start auvtundhi, details chepta. Pongal varaku DonLee update ista mellaga ista! 😅🗿
#Prabhas gari Police getup chudandi.. chudandi ostadhi! 🥵💥 pic.twitter.com/I1Otr921GM— 🐦🔥 (@charanvicky_) November 16, 2024