Spirit Movie Team Casting Call | అగ్ర కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్’(Spirit) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రాబోతుండగా.. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ చివరిలో షూటింగ్ ప్రారంభించనుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం.
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్న వారిని డిజిటల్ ఆడిషన్స్‌కి పిలుస్తుంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది భద్రకాళీ పిక్చర్స్. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించేందుకు 13 నుంచి 17 ఏండ్ల వయసున్న పురుష నటుల(Male Actors)ను ఆడిషన్స్‌లో పాల్గోనవచ్చని తెలిపింది. అయితే ఆడిషన్స్‌లో పాల్గోనేవారు పాత్ర కోసం తమ జుట్టు కత్తిరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలిపింది. అలాగే ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫోటో కూడా జత చేయాలని కోరారు. ఇక ఇంట్రడక్షన్ వీడియోలో మీ పేరు ఇతర వివరాలు వెల్లడించడంతోపాటు మీ చదువుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని కోరారు. ఈ మేరకు వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని కోరారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియో పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
We are on the search for male actors aged 13 to 17 to join the SPIRIT project. If you’ve got the passion and the drive, we want to hear from you. This is your chance to show your skills and be a part of Prabhas-SRV’s Spirit. #YoungTalent #CastingCall #Spirit @imvangasandeep pic.twitter.com/pEMG7Jmz6w
— Bhadrakali Pictures (@VangaPictures) August 7, 2025