Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. “బాహుబలి: ది ఎపిక్” రీ-రిలీజ్‌పై భారీ అంచనాలు నెలకొన్న వేళ, ఆయన మరో భారీ ప్రాజెక్ట్ “ఫౌజీ” షూటింగ్లో తలమునకలై ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్లో ఒక సరదా సంఘటన చోటుచేసుకుంది. ఆ విషయాన్ని నటుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా పంచుకున్నారు. రాహుల్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన లుక్‌లో ఉన్నారు. ఒకప్పుడు హీరోగా నటించిన ఆయన ఇప్పుడు తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో వయస్సు మళ్లిన వ్యక్తిలా “ఫౌజీ” సినిమాలో నటిస్తున్నారు. అందువల్ల చాలామంది ఆయనను గుర్తించలేకపోతున్నారని రాహుల్ చెప్పారు.
ఒక రోజు షూటింగ్ సెట్లో నేను, ప్రభాస్ ఎదురుపడ్డాం. నేను ఆయనకు ‘నమస్తే’ అన్నాను. ఆయన కూడా ‘హలో’ అన్నారు. కానీ తర్వాత ఆయన డైరెక్టర్ హను రాఘవపూడి దగ్గరకు వెళ్లి ‘ఆ యాక్టర్ ఎవరు? ఎక్కడో చూసినట్టుంది’ అని అడిగారు. అప్పుడు హను గారు ‘అతను రాహుల్ రవీంద్రన్ .. నా మొదటి సినిమా అందాల రాక్షసి హీరో అని చెప్పారు. వెంటనే ప్రభాస్ నవ్వుతూ నా దగ్గరకు వచ్చి ‘సారీ ! గుర్తు పట్టలేకపోయా’ అని అన్నారు. పది సార్లు సారీ కూడా చెప్పారు. ఆ తర్వాత మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం” అని రాహుల్ తెలిపారు. అదే సమయంలో రాహుల్, ప్రభాస్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ..“ప్రభాస్ చాలా ఫ్రెండ్లీ పర్సన్, మంచి హ్యూమన్ బీయింగ్. అద్భుతమైన వ్యక్తి. ఆయన బయట సైలెంట్‌గా కనిపించినా, సెట్లో మాత్రం అందరితో సరదాగా ఉంటాడు. ఎవరినైనా నవ్వుతూ పలకరిస్తాడు, జోకులు వేస్తాడు. అందరితో జోవియల్‌గా కలిసిపోతాడు” అని చెప్పారు.
ప్రస్తుతం ప్రభాస్ “ఫౌజీ”తో పాటు కల్కి 2898 AD సీక్వెల్, రాజాసాబ్ మరియు మరికొన్ని భారీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఆయన ప్రతీ సినిమా పట్ల చూపిస్తున్న అంకితభావం, వినయం ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక “ఫౌజీ” సినిమా యాక్షన్, ఎమోషన్ కలబోసిన విభిన్న కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రభాస్ లుక్, కొత్త స్టైల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెట్లో జరిగిన ఈ చిన్న సంఘటన అభిమానుల్లో చర్చనీయాంశం కాగా, ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన వినయం మాత్రం ఎప్పటికీ మారదని మరోసారి నిరూపించింది.