Prabhas – Sandeep Reddy Vanga | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit). భారీ బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అప్డేట్ అంటూ అనౌన్స్‌మెంట్‌ను వీడియోను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పందించాడు.
ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ ఎండింగ్లో ప్రారంభించబోతున్నట్లు సందీప్ రెడ్డి వెల్లడించాడు. నవంబర్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉండబోతుందని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నమని సందీప్ తెలిపాడు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను సందీప్ ఖండించాడు. ఇక ఈ చిత్రంలో యానిమల్ భామ తృప్తి డిమ్రీ కథానాయికగా నటించబోతుంది.