Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)-అనుష్కా శెట్టి (Anushka shetty) గురించి ఏదైనా వార్త వచ్చిందంటే చాలు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. బిల్లా, మిర్చి, బాహుబలి.. సినిమాల్లో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు. ఈ ఇద్దరు మంచి స్నేహితులని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత తన కోస్టార్ అనుష్క నటిస్తున్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty) ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే.
సోలో లైఫ్ లీడ్ చేస్తున్న Miss శెట్టి మిస్టర్ Polishetty మధ్య సాగిన ఫన్నీ ట్రాక్‌తో వినోదాత్మకంగా సాగుతున్న ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ట్రైలర్‌పై ప్రభాస్ తన స్పందన తెలియజేశాడు. Miss శెట్టి మిస్టర్ Polishetty సినిమా చూస్తున్నంతసేపు నవ్వు ఆపుకోలేకపోయా. స్వీటీ, నవీన్ అద్బుతంగా నటించారు. సెప్టెంబర్ 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) అండ్ టీం మెంబర్స్‌కు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు ప్రభాస్.
సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ నడవనుందనేది చాలా ఫన్నీగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఉండనున్నట్టు టీజర్, ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ మహేశ్.
Miss శెట్టి మిస్టర్ Polishetty సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ రివీల్ చేసిన Miss శెట్టి మిస్టర్ Polishetty ఫస్ట్ లుక్‌లో అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుండగా.. మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో ఛిల్ అవుట్ అవుతూ కనిపిస్తున్నాడు.
#Prabhas via Instagram.#MissShettyMrPolishetty Trailer pic.twitter.com/PAf4hnQhsJ
— Suresh PRO (@SureshPRO_) August 21, 2023
Miss శెట్టి మిస్టర్ Polishetty ట్రైలర్..
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..