Project K | బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్ (Prabhas) . ఈ గ్లోబల్ స్టార్ నటిస్తోన్న క్రేజీ చిత్రాల్లో ఒకటి ప్రాజెక్ట్ K (Project k). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. కాగా ఈ మూవీ టీజర్‌ను జులైలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. అయితే తాజాగా టీజర్ లాంఛ్ ఎక్కడ ఉండబోతుందనేదానిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రాజెక్ట్ Kటీజర్‌ను యూఎస్ఏలో గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తాజా సమాచారం.
ఈ చిత్రం నుంచి విడుదల చేసిన దీపికా పదుకొనే లుక్‌తోపాటు ప్రభాస్ హ్యాండ్ లుక్ సినిమా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ప్రాజెక్ట్ Kలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మేకర్స్ ప్రాజెక్ట్ Kలో కీలకం కాబోయే రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను విడుదల చేయగా.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
నాగ్ అశ్విన్ టీం అనుకున్న ప్లాన్ ప్రకారం అక్టోబర్ కల్లా వీఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్, డిజిటల్ ఇంటర్మీడియట్ పనులను పూర్తి చేయనున్నారని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్న ఇ2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రభాస్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్న సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దీంతోపాటు మారుతి హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పై ఉంది. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ ఓ వైపు విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
The #ProjectK title and motion poster will be launched in a grand event at USA🇺🇸 in July.#Prabhas pic.twitter.com/KleD9dHgJC
— Manobala Vijayabalan (@ManobalaV) June 22, 2023
రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023