Project-K Movie Release Date | ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ కాస్త నిరాశచెందాడు. ప్రస్తుతం ఆయన ఒక సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపకుంటుంది. ఇదిలా ఉంటే చిత్రబృందం తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
మహాశివరాత్రి కానుకగా ప్రాజెక్ట్-K మూవీ నుండి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ మేకర్స్ విడుదల తేదిని ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఒక పెద్ద చేయి, దానిని టార్గెట్ చేస్తూ ముగ్గురు వ్యక్తులు.. చుట్టు పక్కల పెద్ద పెద్ద మిషన్లు, కూల్పోతున్న అపార్టుమెంట్స్ ఇలా పోస్టర్‌తోనే సినిమాపై ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. పోస్టర్లో పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు కానీ ఫ్యూచర్‌కు సంబంధించిన సెటప్ అని తెలుస్తుంది.
ఇప్పటి వరకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సరికొత్త రీతిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, వీల్ వీడియోలు చూస్తే తెలుస్తుంది. రీఇన్వెంటింగ్ ది వీల్ అంటూ రిలీజ్ చేసిన వీడియోకు విశేష స్పందన వచ్చింది. సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచర్ గురించి ఉంటుందని, వరల్డ్ వార్-3 టైమ్ లైన్లో ఈ సినిమా జరుగుతుందని ఆ మధ్య నిర్మాత అశ్వినీదత్ తెలిపాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తుంది. తెలుగులో దీపికాకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023