Project K | ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ K (Project k). సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్న అభిమానులకు మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం ప్రాజెక్ట్ K షూటింగ్ 75 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని మరికొన్ని వారాల్లో పూర్తి చేయబోతున్నారని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వెంటనే మొదలుపెట్టబోతున్నారని ఇన్సైడ్ టాక్.
నాగ్ అశ్విన్ టీం సెట్ చేసిన టైమ్ లైన్ ప్రకారం వచ్చే అక్టోబర్ కల్లా వీఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్, డిజిటల్ ఇంటర్మీడియట్ పనులను పూర్తి చేయనున్నారట. 2024 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ కల్లా ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అనుకున్న టైమ్ లైన్ ప్రకారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ప్రభాస్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్న సలార్ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. దీంతోపాటు మారుతి హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పై ఉంది.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రాజెక్ట్ Kలో కీలకంగా సాగే రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన దీపికా లుక్, వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023