Prabhas-Prashanth Neel | రోజు రోజుకు ప్రభాస్ లైనప్ చూస్తుంటే ప్రేక్షకులకు మతిపోతుంది. ఒక హాలీవుడ్ హీరో రేంజ్ స్థాయిలో తనపై బిజినెస్ జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల బడ్జెట్ దాదాపు రూ.3వేల కోట్లకు పైమాటే. ఒక టాలీవుడ్ హీరోకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందంటే విశేషం అనే చెప్పాలి. ఇక ప్రభాస్ లైనప్‌లో రోజుకో కొత్త సినిమా చేరుతుంది. మొన్నటి మొన్న సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమా ఉన్నట్లు మైత్రీ ప్రకటించగా.. తాజాగా ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబోలో ఓ పీరియాడిక్ సినిమా తెరకెక్కనున్నట్లు దిల్‌రాజు ప్రకటించాడు.
ఇప్పటికే ప్రభాస్-ప్రశాంత్‌నీల్ కాంబోలో సలార్ తెరకెక్కుతుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుండి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి. ‘కేజీఎఫ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రశాంత్‌నీల్, ప్రభాస్‌తో సినిమా చేయనుండటంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ఇక ఇది సెట్స్ మీద ఉండగానే వీళ్ల కాంబోలో మరో మూవీ సిద్ధమైంది. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘రావణం’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు దిల్‌రాజు తెలిపాడు. కాగా సలార్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ‘ప్రాజెక్ట్-K’, ‘రాజాడిలక్స్’ షూటింగ్ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.