Prabhas | టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బైకర్ ఇప్పటికే సినీ వర్గాల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తన కాన్సెప్ట్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.ఈ ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ “బైకర్ ట్రైలర్ వైబ్ అదిరిపోయింది” అంటూ ప్రశంసలు కురిపించాడు. ట్రైలర్ చాలా ఎంగేజింగ్‌గా ఉందని, సినిమా టీమ్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశాడు. ముఖ్యంగా శర్వానంద్‌తో పాటు నిర్మాణ సంస్థకు కూడా విజయాన్ని కోరుకున్నాడు.
ఈ ట్రైలర్లో హై-ఆక్టేన్ రేసింగ్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ అన్నీ బ్యాలెన్స్డ్ చూపించడం విశేషం. శర్వానంద్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తూ, రేసర్ పాత్రలో తన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు సీనియర్ నటుడు రాజశేఖర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక నాయర్ నటిస్తుండగా, భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ చిత్రాన్ని స్టైలిష్ రేసింగ్ డ్రామాగా రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
మోటోక్రాస్ రేసింగ్ వంటి కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌కు వస్తున్న స్పందనను బట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల కానున్న ‘బైకర్’ మూవీ, శర్వానంద్ కెరీర్లో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.