Prabhas | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దేశభక్తి, యుద్ధం, త్యాగం అనే అంశాల చుట్టూ తిరిగే ఈ కథ, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 60% చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.
ప్రభాస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరించేందుకు ఇంకా 35 రోజుల షూటింగ్ మిగిలి ఉందని టాక్. సినిమాకు ‘ఫౌజీ’ అనే పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, త్వరలోనే అధికారికంగా టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఎమోషనల్ టచ్‌కు ప్రాధాన్యతనిచ్చే దర్శకుడైన హను రాఘవపూడి స్టైల్‌కు ప్రభాస్ యాక్షన్ ఇమేజ్ కలిస్తే, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించనున్నట్లు ఇండస్ట్రీలో భావిస్తున్నారు. ‘ఫౌజీ’ సినిమాను 2026 ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనే లక్ష్యంతో బృందం ప్రణాళికలు రచిస్తోంది.
ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా, కథానాయికగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన సెట్ వర్క్, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించబడుతున్నాయి. సైనిక నేపథ్యాన్ని బట్టి యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా గ్రాండ్‌గా ఉంటాయని సమాచారం. సినిమా కథాభాగం విస్తృతంగా ఉండటంతో, నిర్మాతలు ఈ సినిమాను సిరీస్‌గా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ‘ఫౌజీ’కి ప్రీక్వెల్ చేసే స్కెచ్ కూడా సిద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇది అధికారికమైతే, ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా డబుల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం “ది రాజాసాబ్” కూడా ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి అంటే జనవరి 9న విడుదల కాబోతోంది. అలాగే ప్రభాస్ చేతిలో సలార్ 2, స్పిరిట్, కల్కి 2 వంటి మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.