Prabhas | మూవీ లవర్స్ ఫోకస్ అంతా ఇప్పుడు గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)పైనే ఉంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది. వరల్డ్‌వైడ్‌గా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మేనియా షురూ అయింది.
ఉత్తర భారతదేశంలో బుకింగ్స్ గ్రాండ్‌గా షురూ అయ్యాయి. మిడ్ వీక్‌లో విడుదలవుతున్నప్పటికీ కల్కి 2898 ఏడీ బుకింగ్స్ మొదలుపెట్టిన కొన్ని గంటలకే ఈ మూవీ నేషనల్ బెల్ట్‌లో హిందీ వెర్షన్ టిక్కెట్స్ సుమారు 13 వేలకుపైగా అమ్ముడయ్యాయి. ఇక కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ సేల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.50 కోట్లు దాటింది. గ్లోబల్ స్టార్‌గా మారాక ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఫిగర్ చాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా, అతని దోస్త్ బుజ్జి (Bujji) పాత్రలో స్పెషల్ కారు కనిపించనుంది. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా… బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా కనిపించబోతున్నాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#KALKI2898ADBookings in North India are off to a great start. Even with a mid-week release, the Hindi version of #Kalki2898AD has sold almost 13K tickets in national chains just a few hours after bookings opened 🔥🔥🔥. Worldwide Advance sales already crossed 50crs💥 #Prabhas pic.twitter.com/doc99J6N4L
— Mumbai Box-Office (@MumbaiBoxOffice) June 24, 2024