Spirit | డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ షూటింగ్లో డార్లింగ్ ఈరోజు నుంచే పాల్గొంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో కొత్త హాట్ టాపిక్ మొదలైంది . ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ‘వంగా జైలులో’ బందీగా ఉండబోతున్నారా అని ముచ్చటించుకుంటున్నారు. మామూలుగా స్టార్ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ డేట్స్‌ను అడ్జెస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ సందీప్ వంగా విషయంలో అది కుదరదు. లుక్ నుంచి మూడ్ వరకు కన్విన్స్‌గా ఉండాలంటే ఆర్టిస్ట్ పూర్తిగా ఒకే ప్రపంచంలో ఉండాలి అన్నది ఆయన స్టైల్. అందుకే ప్రభాస్‌కు కూడా బల్క్ డేట్స్ తప్పనిసరిగా కావాలనే షరతు పెట్టాడట.
ఇక ప్రభాస్ కూడా ఈసారి పాత్ర డిమాండ్ ఎంత కఠినమో అర్థం చేసుకుని, పూర్తిగా వంగా కాంపౌండ్‌కి సరెండర్ అయ్యాడు. రాబోయే రెండు నెలల పాటు ఇతర చిత్రాలన్నింటినీ పక్కన పెట్టి ‘స్పిరిట్’పైనే ఫోకస్ పెట్టబోతున్నాడు. ఇటీవల విడుదలైన డార్క్ ఆడియో టీజర్లో ప్రభాస్ ఒక సీరియస్ పోలీస్‌గా, మరోవైపు ఖైదీలా కనిపించిన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. అదే ఇమేజ్‌లో ఇప్పుడు రాపిడ్ ఫైర్ షూటింగ్ ప్రారంభమైంది. వంగా మార్క్ వైలెన్స్, ప్రభాస్ కటౌట్ కలిసి రావడంతో ఏమేరకు ఇంటెన్సిటీ ఉండబోతుందో ఫ్యాన్స్ ఊహించగలుగుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న భారీ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, రా ఎమోషన్స్‌తో కూడిన సీన్స్ చిత్రీకరించబోతున్నారు. వంగా ఒకసారి కెమెరా ఆన్ చేస్తే అవుట్‌పుట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్జున్ రెడ్డి, యానిమల్ చూసిన తర్వాత అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూసిన ‘స్పిరిట్’ ఇప్పుడు వేగంగా పరుగులు పెడుతుంది. ప్రభాస్ ఇంటెన్స్ లుక్, వంగా మాస్-సైకో విజన్ కలిసితే కల్ట్ క్లాసిక్ తప్పదనే ఫీలింగ్ అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. షూటింగ్ అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో, ఇప్పటి నుండి నుంచి రెగ్యులర్‌గా ‘స్పిరిట్’ అప్డేట్స్ రానున్నాయి. సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేయడానికి ఈ కాంబినేషన్ సిద్ధమైందనడంలో సందేహమే లేదు. వంగా జైలులో ప్రభాస్ లాక్ అయిన నేపథ్యంలో ఈ రెండు నెలలు ఫ్యాన్స్‌కు నాన్ స్టాప్ ఎగ్జైట్మెంట్ ఇవ్వడం ఖాయం.