Prabhas | టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం నేటి నుండి థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో మంచు విష్ణు లీడ్ రోల్ పోషించాడు. ప్రభాస్ క్యామియో రోల్లో కనిపించనున్నాడు. రుద్రగా ప్రభాస్ పోస్టర్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే చిత్రంలో ప్రభాస్ చేసింది కామియో రోల్ అయిన ఇంపాక్ట్ వేరే లెవల్లో ఉంది. ఇటీవల ఓ థియేటర్ ముందు ప్రభాస్ భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే సినిమాలో ప్రభాస్ 30 నుండి 40 నిమిషాల పాటు కనిపించనున్నట్టు తెలుస్తుంది.
అయితే సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ సందడి లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపిస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని వారికి నిరాశ ఎదురైంది. ప్రభాస్‌ని తీసుకురావాలని చిత్ర బృందం ఎంతగానో ప్రయత్నించింది. కాని వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వలన కుదరలేదట. కనీసం ప్రభాస్‌తో బైట్ చెప్పించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయిన ప్లే చేయించాలని అనుకున్నారు. అది కుదరలేదు. దీంతో ప్రభాస్.. కన్పప్ప మూవీ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్ధం కావడం లేదని అందరు ముచ్చటించుకుంటున్నారు.
అయితే ముందే ప్రమోషన్స్ లో పాల్గొనని మేకర్స్ కు చెప్పేశారట డార్లింగ్ ప్రభాస్. సినిమాలో యాక్ట్ మాత్రం చేస్తానని.. కానీ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల ప్రమోషన్స్ కు రాలేనని అన్నారట. అయితే ఈ రోజు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ తన పాత్రకి సంబంధించిన పోస్టర్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..కన్నప్ప ఈ రోజు నుండి పెద్ద తెరపై సందడి చేయనున్నాడు. తన ప్రాణం కన్నా ఎక్కువ ఇచ్చిన వ్యక్తి ఇతిహాస కథ ఇది. కన్నప్ప ఇప్పుడు దైవిక శరణాగతి సాక్షిగా నటిస్తున్నాడు అంటూ కామెంట్ చేశాడు. ఎట్టకేలకి కన్నప్ప గురించి ప్రభాస్ స్పందించడం పట్ల చిత్ర బృందంతో పాటు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.