Prabhas-Hanu | రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో కొనసాగుతోంది. ఆర్మీ, యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో కొత్త భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.ఇక రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్ కాళ్లు మాత్రమే చూపిస్తూ, “A Soldier Marches Alone” అనే లైన్‌తో ఆసక్తి రేపారు. పోస్టర్‌పై “Most Wanted Since 1932” అనే వాక్యం కూడా ఉండటంతో చిత్ర కథ యుద్ధం నేపథ్యంతో పాటు స్పై కథాంశం నేపథ్యంలో కూడా ఉండొచ్చని అభిమానులు ఊహిస్తున్నారు.
ఈ పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా ఒక విషయం మాత్రం ఖాయం చేశారు . ప్రభాస్ హను రాఘవపూడి సినిమా టైటిల్ రేపు అక్టోబర్ 23 ఉదయం 11:07 గంటలకు విడుదల కానుందని తెలియజేశారు. మూవీకి “ఫౌజీ” అనే టైటిల్ ఫిక్స్ చేస్తారా లేక కొత్త టైటిల్‌తో మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తారా అన్నదానిపై ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది.అతడే ఒక సైన్యం అనే కాంటెక్స్ట్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేయగా, ‘1932 నుంచి ది మోస్ట్ వాంటెడ్’ అనే క్యాప్షన్ ఈ పోస్టర్లో ప్రత్యేకంగా మారింది. దీంతో అసలు ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడనే ఆసక్తి అందరిలో పెరుగుతూ పోతుంది.
ఏదేమైనా ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రాబోయే ఈ అప్డేట్ టాలీవుడ్ మాత్రమే కాక పాన్ఇండియా అభిమానుల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సీతారామం వంటి క్లాసికల్ లవ్‌స్టోరీ తరువాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం