Prabhas | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పెళ్లిని మరీ పక్కన పెట్టి ఒప్పుకున్న ప్రాజెక్టులని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రభాస్ ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సోషల్‌మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజాగా మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే దర్శకుడు హను రాఘవపూడికి ప్రభాస్ కూల్ వార్నింగ్ ఇచ్చాడట.
ఈ మధ్య హను రాఘవపూడి సెట్లో కాస్త హడావిడిగా ఉండటం, అప్పుడప్పుడూ టెక్నీషియన్స్ పై కోప్పడటం, అరవటం వంటివి చేస్తూ సెట్ లో చాలా టెన్షన్ గా ఉంటున్నారట. అయితే ఇదంతా మంచి ఔట్పుట్ కోసమే అయిన కూడా తన మూవీ సెట్లో అలా ఉండకూడదని భావించిన ప్రభాస్.. హను రాఘవపూడిని పిలిచి కూర్చోపెట్టి, హడావిడి పడద్దుని, కూల్ గా ఉంటేనే మంచి ఔట్పుట్ వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంద.ఇక ఇదిలా ఉంటే ఈ మూవీని హను రాఘవపూడి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కోసమే తాను ఈ కథ రాశానని, ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలు ఇందులో ఉన్నాయని హను అన్నారు. కొత్త కథని ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్‌తో సిద్ధమవుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో ఇన్స్టాగ్రామ్ స్టార్‌గా యువతకి చాలా దగ్గరైన ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండడం విశేషం.