ప్రభాస్ ‘ఫౌజీ’ విడుదల అప్పుడేనా?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2027, మార్చి 18న ‘ఫౌజీ’ని విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విడుదల చేసే ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించనున్నారట. ‘ఫౌజీ’ లాంటి పాన్ ఇండియా చిత్రం రిలీజ్‌కి మార్చి 18 సరైన డేట్ అని ఫిల్మ్ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్లు చాలా మారాయి. డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించగానే, ఇక ఆ డేట్ ఖాయమని అంతా అనుకున్నారు. అయితే.. చిత్రీకరణలో జాప్యం కారణంగా వచ్చే ఏడాదికి సినిమా వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2027, మార్చి 18న ‘ఫౌజీ’ని విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విడుదల చేసే ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించనున్నారట. ‘ఫౌజీ’ లాంటి పాన్ ఇండియా చిత్రం రిలీజ్‌కి మార్చి 18 సరైన డేట్ అని ఫిల్మ్ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ రోజు గురువారం కాగా, మార్చి 21 ఆదివారం వరకూ లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసొచ్చింది. అంతేకాదు, సోమవారం హోలీ పండుగ కారణంగా సెలవు కలిసొచ్చింది. మళ్లీ మార్చి 26న గుడ్ ప్రైడే. ఇవన్నీ ‘ఫౌజీ’కి కలిసొచ్చే అంశాలు. అందుకే ఆ డేట్‌ని మేకర్స్ ఫిక్స్ చేసినట్టు వినికిడి. అయితే.. ‘ఫౌజీ’ మార్చి 18న రాబోతున్న సందర్భంగా ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ‘స్పిరిట్’ని మార్చి 5న విడుదల చేయనున్నట్టు సందీప్‌రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ‘ఫౌజీ’ కారణంగా ‘స్పిరిట్’ ఏప్రిల్‌కి వెళ్లే అవకాశం ఉన్నదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

