సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, హీరో ప్రభాస్ కాంబో ఒకటి. సుదీర్ఘ కెరీర్లో పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసి గొప్ప విజయాల్ని అందుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్. అయితే ప్రభాస్‌తో ఆయన సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రభాస్ ఎక్కువగా మాస్, యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన నుంచి చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ కథను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం ప్రభాస్‌కు ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఈ సినిమా పట్టాలెక్కడానికి రెండేళ్లకుపైగా సమయం పడుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.