Salaar | ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సలార్. రెండు పార్టులుగా వస్తుండగా.. సలార్ పార్టు 1 డిసెంబర్ 22న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
అక్టోబర్ 23 (సోమవారం)న ప్రభాస్ పుట్టినరోజు (Birthday) సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసే ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారు అభిమానులు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రభాస్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ బర్త్ డే నేపథ్యంలో సలార్ టీం ఆన్లైన్ ప్రమోషనల్ క్యాంపెయిన్ షురూ చేసింది. దీని కోసం ట్విట్టర్లో స్పెషల్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రత్యేకించి hashflagను క్రియేట్ చేసింది.
#Prabhas, #Salaar, #SalaarCeaseFire, #SalaarComingBloodySoon, #SalaarCeaseFireOnDec22 హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండ్ కానున్నాయి. జనవరి 21 వరకు ఈ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ కనిపించనున్నాయి. మాఫియా నేపథ్యంలో వస్తోన్న సలార్ టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు సోషల్ మీడియాను ఇప్పటికే షేక్ చేస్తున్నాయి. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్న సలార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ప్రభాస్ మరోవైపు సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోన్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే కల్కి 2898 ఏడీ నుంచి టైటిల్, గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా స్పెషల అనౌన్స్మెంట్ ఉంటుందేమో చూడాలి.
💥💥💥#Prabhas #SalaarCeaseFireOnDec22 #Salaar #SalaarCeaseFire#SalaarComingBloodySoon
— Salaar (@SalaarTheSaga) October 22, 2023
Loading…… #Salaar #Prabhas pic.twitter.com/P6y1HYjRcH
— Sagar (@SagarPrabhas141) October 22, 2023
సలార్ టీజర్..