Prabhas Special Mashup | రెబల్ స్టార్ ప్రభాస్ నేడు తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ స్పెషల్ మ్యాష్అప్ వీడియోను వదిలింది. ‘అర్జునుడి లాంటి రూపం.. శివుడి లాంటి బలం.. రాముడి లాంటి గుణం..’ మొదలైన ఈ వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.