పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ కలిసి హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ (PCX) లో ఉన్న ‘F1’ సినిమాను వీక్షించారు. వీరిద్దరూ ఎఫ్1 సినిమాను చూస్తుండగా థియేటర్లో అభిమానుల మధ్య కనిపించడంతో ఈ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీరిద్దరిని చూసిన అభిమానులు ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం ఎప్పుడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో కలిసి డ్రాగన్ అనే ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమా అనంతరం సలార్ 2 సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.
అమెరికన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన చిత్రం F1. ఫార్ములా 1 రేసింగ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో డామ్సన్ ఇడ్రిస్, కెరీ కాండన్, జావియర్ బార్డెమ్, టోబియాస్ మెంజీస్, సారా నైల్స్, కిమ్ బోడ్నియా, సామ్సన్ కాయో తదితరులు కీలక పాత్రల్లో నటించారు.