Salaar | ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ వర్క్స్‌లో జాప్యం కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సోషల్‌మీడియాతో పాటు సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే వీటిపై చిత్రబృందం ఇప్పటివరకు స్పందించలేదు.
దాంతో ఈ సినిమా విడుదల ఎప్పుడనేది అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని తెలుస్తున్నది. అయితే ఈ సినిమా రిలీజ్ స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనంటున్నారు.