Adipurush | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ఆదిపురుష్ (Adipurush). తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్షన్లో మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచేసింది ప్రభాస్ టీం. ఇవాళ ఏపీలోని ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతా రెడీ అయింది. ఇప్పటికే ప్రభాస్ పంచెకట్టులో కొత్తగా రెడీ అయి.. శ్రీవారి సేవలో పాల్గొన్న విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈవెంట్లో 50 అడుగుల పొడవైన ప్రభాస్ హోలోగ్రాఫిక్ ఇమేజ్ వేదిక కిందున్న ప్రేక్షకులను ఆకర్షించేలా ఉండబోతుంది. ఈ ప్రదర్శనతోపాటు 100 మందికి పైగా డ్యాన్సర్లు, 100 మంది గాయకులు వేదికపై ప్రత్యేక ప్రదర్శనల మధ్య హోలోగ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్టు సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా స్టేడియంలో భారీ సెట్‌ను రెడీ కూడా చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈవెంట్‌కు హాజరైన వారందరికీ అపూర్వమైన, మరపురాని అనుభూతిని అందించేలా ప్రశాంత్ వర్మ టీం ప్లాన్ చేసుకుంది. ఈవెంట్‌కు లక్ష మందికిపైగా హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి (లంకేశ్)గా నటిస్తున్నాడు. ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. దేవ్‌దత్తా నగే హనుమంతుడి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఎయిర్‌పోర్టులో కృతిసనన్..
Our #Janki @kritisanon off to #Tirupati to attend today’s #AdipurushPreReleaseEvent .#Prabhas #Adipurush#AdipurushActionTrailer #AdipurushOnJune16th pic.twitter.com/ef3QIj6XsD
— Vaishali Gangodkar🏹🚩 (@Vaishali695) June 6, 2023
శ్రీవారి సేవలో ప్రభాస్..
#Prabhas Wearing full white dress to attend pooja & seek darshanam at #Tirumala #Tirupati ….
Looking handsome in #white 🤍
🔥❤️😍#AdipurushPreReleaseEvent #AdipurushActionTrailer #Adipurush #AdipurushOnJune16 pic.twitter.com/zB86ZOlKp5
— Vaishali Gangodkar🏹🚩 (@Vaishali695) June 6, 2023
Mid-Night Time Lo Kuda Ah Crowd Endhi Ra 🥵🔥🔥
Kevalam Neeke Sadyam Rebel Anna 🛐#Prabhas #AdipurushActionTrailer pic.twitter.com/vJoQwQUEPp— Prabhas DOMAIN (@Prabhas_Domain) June 6, 2023
మరికొన్ని గంటల్లో యాక్షన్ ట్రైలర్..
Less than 4 hours to go…
Brace yourselves for the captivating #AdipurushActionTrailer. 🔥🔥
Get ready to embark on an extraordinary journey into the realm of epicness.
Jai Shree Ram 🏹#Adipurush#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar… pic.twitter.com/pvUE1G260v
— T-Series South Official (@tseriessouth) June 6, 2023