prabhas 25 | ప్రభాస్ 25వ సినిమా కోసం భారీ స్కెచ్ వేస్తున్న దిల్ రాజు

prabhas 25 | ప్రభాస్ ప్రస్తుతం 20వ సినిమాతో బిజీగా ఉన్నాడు. అంతలోనే 25వ సినిమా గురించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. 2022 సంక్రాంతికి రాధే శ్యామ్ విడుదలవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెంటనే ఆది పురుష్ విడుదల కానుంది. ఈ మూడు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొదలు కానుంది. అశ్వినీదత్ నిర్మాణంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ టైం మిషన్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇది ప్రభాస్‌కు 24వ సినిమా. ఈ నాలుగు సినిమాలతో పాటు 25వ సినిమాపై ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడు ప్రభాస్.
ప్రభాస్ 25వ సినిమా కోసం తెర వెనుక భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుసగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఒప్పుకుంటున్నాడు ప్రభాస్. రెబల్ స్టార్ సినిమా అంటే ఇప్పుడు కనీసం 150- 200 కోట్లు బడ్జెట్ పెట్టాలి. ఈ క్రమంలోనే ఈయన 25వ సినిమాను ఎవరు తెరకెక్కించబోతున్నారు.. నిర్మాత ఎవరు అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. దీనికి తగ్గట్టుగానే తన 25 వ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్ హీరోగా మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది. అది ప్రభాస్ 25వ సినిమా. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే 25వ సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతుంది. దీనికోసం తెరవెనుక ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
పీరియాడికల్ బాక్ డ్రాప్లో ఈ సినిమా కథ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. దీని కోసం వృందావన అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో ఇప్పుడు మామూలు సినిమాలు చేయడం సాధ్యం కాదు. అందుకే ఆయన ఇమేజ్‌కు సరిపోయే పీరియాడికల్ కథ దిల్ రాజు సిద్ధం చేయిస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. 2024లో ప్రభాస్ 25వ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయనున్నాడు ప్రభాస్. ఏదేమైనా తన మైల్ స్టోన్ సినిమా కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రభాస్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

