Prabhas Ranked No.1 Place | ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. అయితే ఈ రెండు చిత్రాల ఫలితాలు ప్రభాస్ క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఒక్కో సినిమాకు ప్రభాస్ దాదాపు రూ.120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్స్‌లో ఉన్న సినిమాలే దాదాపు రూ.2000కోట్ల వరకు బిజినెస్‌ను జరుపుకుంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ అరుదైన ఘనతను సాధించాడు.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ వరుస స్థానాల్లో ఉన్నారు. జూలై నెలలో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో ఉండగా కాజల్ రెండవ స్థానంలో ఉంది.