టాలీవుడ్ హీరోల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిండి. ఈ మధ్య కాలంలో ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకోవడం బాగా చూస్తున్నాం. ముఖ్యంగా అల్లు అర్జున్ ఒకవైపు పుష్ప షూటింగ్ చేస్తూనే మరోవైపు చిన్న, పెద్ద సినిమాలకు తన వంతు సపోర్ట్ అందిస్తున్నాడు. రీసెంట్గా అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్యతో కలిసి రచ్చ చేశాడు ఐకాన్ స్టార్. ఇప్పుడు ఈ హీరో సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రాధే శ్యామ్ రాబోతున్నాడని అంటున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. అందులో తొలి భాగం పుష్ప ది రైజ్.. డిసెంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. సమంత, బన్నీల మధ్య సాగుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి చెప్పిన టైంకి మూవీని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు పుష్ప ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేయనున్నారు. త్వరలోనే పుష్ప ది రైజ్ ప్రీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నారట. పుష్ప కోసం ప్రభాస్ రావడం అంటే నిజంగా గొప్ప విషయమే. మంచి పరిణామం కూడా. ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు కనుల పండగగా ఉండడం ఖాయం. కాగా, ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతుంది.