Sai Pallavi | నా విలువను పెంచదు.. పీఆర్ ఏజెన్సీపై సాయిపల్లవి కామెంట్స్ వైరల్
Sai Pallavi | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న భామల్లో ఒకరు సాయి పల్లవి (Sai Pallavi). ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి అమరన్. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్టార్డమ్, మార్కెట్‌ను పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుంటారని తెలిసిందే. అమరన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవి బీటౌన్‌లో పీఆర్ మాఫియా గురించి చెప్పుకొచ్చింది.
Sai Pallavi | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న భామల్లో ఒకరు సాయి పల్లవి (Sai Pallavi). ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి అమరన్. శివకార్తికేయన్ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్టార్డమ్, మార్కెట్‌ను పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుంటారని తెలిసిందే. అమరన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవి బీటౌన్‌లో పీఆర్ మాఫియా గురించి చెప్పుకొచ్చింది.
తన ఇమేజ్ను పెంచుకోవడానికి పీఆర్ ఏజెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిందట సాయిపల్లవి. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. బాలీవుడ్‌కి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెషనల్‌గా నా ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు PR ఏజెన్సీ అవసరమా..? అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్‌లైట్‌లో ఉంటా. అందరూ నా గురించి మాట్లాడతారని అతడు చెప్పాడు. నేను మాత్రం వద్దని చెప్పాను. ఎందుకంటే పీఆర్ ఏమీ ఇవ్వదు. అంతేకాదు పీఆర్ నా విలువను పెంచదు. నా గురించి తరచూ మాట్లాడితే జనాలకు విసుగు వస్తుంది. నేను ఖాళీ పబ్లిసిటీ కంటే నిజమైన అనుబంధానికి ఎక్కువ విలువ ఇస్తానని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి మరోవైపు నాగచైతన్య హీరోగా నటిస్తోన్న తండేల్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇందులో శ్రీకాకుళం అమ్మాయి సత్యగా కనిపించనుంది. హిందీలో రామాయణతోపాటు టైటిల్ ఫిక్స్ కాని మరో సినిమా కూడా చేస్తోంది.
Read Also :
Pottel Review | అనన్య నాగళ్ల టీం అంచనాలు అందుకుందా.. ? పొట్టేల్ రివ్యూ..
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Thandel | నాగచైతన్య తండేల్ టీమ్ ముందు రెండు ఆప్షన్లు.. ఏది ఒకే చేస్తారో మరి..?
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

