ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరుని అధికారికంగా ఖరారు చేశారు. బుధవారం ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పవర్ఫుల్ ఫస్ట్గ్లింప్ప్ను విడుదల చేశారు. 1967 నేపథ్యంలో చీకటి ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్రాంతంలో ఓపియం అక్రమ రవాణా నేపథ్యంలో కథ జరిగినట్లుగా చూపించారు. ‘దేవుడు నాకొక వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం. నిదురపోయినప్పుడు నా కల్లోకి నేను చంపినవాళ్ల ముఖాలు రావు.
మిగిలివున్న శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. డ్రాగన్ పాత్రలో ఎన్టీఆర్ దృఢమైన దేహంతో ఫిట్ అండ్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ‘డ్రాగన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. రుక్మిణి వసంత్, ఖుష్బూ సుందర్, అనిల్ కపూర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రానా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: భువన్‌గౌడ, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌నీల్.