Nenu Meeku Baga Kavalsinavaadini Trailer | ఫలితం ఎలా ఉన్నా కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు ‘రాజావారు రాణిగారు’, ‘SR కళ్యాణ మండపం’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచిన ఇటీవలే వచ్చిన ‘సమ్మతమే’తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ఒకటి. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్పెంబర్ 15న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. కాగా గురువారం ఈ సినిమా ట్రైలర్ విడులకానుంది.
ఈ సినిమా ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ట్విట్టర్లో ‘మనందరికి కావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు’ అంటూ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య, దీప్తి నిర్మించారు. మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.
Mana andariki baga kavalsina 'Power Star' @PawanKalyan garu to launch @Kiran_Abbavaram's #NenuMeekuBaagaKavalsinavaadini Trailer 💪🏻
Get ready,
Releasing today at 5:04pm 🔥#NMBK #NMBKOnSep16th@itssanjanaanand @LyricsShyam #Manisharma @kodidivya @sridhar_chotu @KodiDivyaaEnt pic.twitter.com/73zNxLxHdt— KodiDivyaaEntertainments (@KodiDivyaaEnt) September 8, 2022
Read Also:
Adipurush Movie | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్?
Sharwanand | ఆ సినిమా ఫ్లాప్ అవడంతో శర్వానంద్ మూడు నెలలు బయటకు రాలేదట..!
Nane Varuven | ‘నానే వరువెన్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మరోసారి మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన యువన్