Pawan kalyan | భీమ్లా నాయక్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
Power star Pawan kalyan | సినిమా ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్స్నే. కలిసొస్తే సై అంటారు.. లేకపోతే నై అంటారు మన స్టార్స్. హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఎవరైనా సరే సెంటిమెంట్ కంటే పెద్దదేమీ కాదంటారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ( Bhimla nayak ) సినిమా విషయంలో ఒక సెంటిమెంట్ ఫ్యాన్స్‌ను కంగారు పెడుతుంది. ఈ బ్యాడ్ సెంటిమెంట్‌తో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందేమోనని టెన్షన్ పెట్టిస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ ఇది. నిజానికి ఇది పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా. కానీ బయటకు మాత్రం పవర్ స్టార్ సినిమాగానే ప్రమోట్ అవుతుంది. టైటిల్ కూడా ఆయన క్యారెక్టర్ పేరునే భీమ్లా నాయక్ అని పెట్టేశారు దర్శక నిర్మాతలు. దీన్ని బట్టి ఇది మల్టీస్టారర్ కాదు.. సింగిల్ స్టారర్ సినిమా అని అర్థమైపోయింది. ఏదేమైనా సినిమాపై మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పిచ్చెక్కించింది. తమన్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చిన ఈ సాంగ్‌కు.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ కొల్లగొడుతుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్, మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఫ్యాన్స్‌ను తెగ టెన్షన్ పెడుతుంది. అదేంటంటే.. పదేళ్ల కిందట తీన్మార్ సినిమా చేశాడు పవన్ కళ్యాణ్ ( pawan kalyan ). బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను జయంత్ సి పరాన్జీ తెరకెక్కించాడు. స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ ( trivikram ).. పవన్ కళ్యాణ్ కోసం ఒక మెట్టు దిగి మరీ ఈ సినిమా కోసం మాటలు రాశాడు. కానీ బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ఈ సినిమా టాలీవుడ్లో నిరాశ పరిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమాని అయిన నితిన్ కోసం మరోసారి కథ అందించాడు త్రివిక్రమ్. అదే ఛల్ మోహన్ రంగ. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. త్రివిక్రమ్ ఈ రెండుసార్లు పవన్ కళ్యాణ్ కోసం మెట్టు దిగి.. మెగాఫోన్ పక్కన పెట్టి కథ, మాటలు అందించాడు. కానీ రెండుసార్లు ఫలితం తేడా కొట్టింది. అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను ఇప్పుడు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఈ క్రమంలోనే మూడోసారి తన డైరెక్టర్ హోదాను పక్కనబెట్టి భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు మాటల మాంత్రికుడు. కానీ మూడోసారి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఏమోనని ఫ్యాన్స్ మాత్రం కాస్త కంగారు పడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న భీమ్లా నాయక్ విడుదలకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్త చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
pawan kalyan remuneration | హరీష్ శంకర్ సినిమాకు 10 కోట్లు పెంచేసిన పవర్ స్టార్
మేము ఐదుగురం కాదు.. ఎనిమిది మంది.. మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

