Teja | సినీ ఇండస్ట్రీలో ఎవరు ఏమనుకుంటారనే దానితో సంబంధం లేకుండా కేవలం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు చాలా తక్కువే అని చెప్పాలి. అలాంటి వారి జాబితాలో టాప్‌లో ఉంటారు డైరెక్టర్ తేజ (Teja). థియేటర్లో సినిమా అనేది అంతిమంగా సాధారణ ప్రేక్షకుడు కుటుంబ సమేతంగా చూసేలా ఉండాలంటున్నాడు తేజ. ఓ ఇంటర్వ్యూలో తాజాగా డైరెక్టర్ తేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి.
పాప్ కార్న్, కోక్ ధరలు మల్టీప్లెక్స్ ‘ (Multiplexes)లలో సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో లేవు. నేను సినిమాను పాప్‌కార్న్, సమోస తింటూ చూస్తా. బాంబేలో హిందీ సినిమాను ఓటీటీ లేదా టీవీ చంపేసిందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఆ పని చేసింది పాప్ కార్న్. అయితే పాప్‌కార్న్ (Popcorn) తెలుగు సినిమాను చంపలేదు. ఎందుకంటే మనకు ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. నేనైతే ప్రతీ ఒక్కరూ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్లాలని సూచిస్తా. స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది. మల్టీప్లెక్స్ ఎక్కువగా ఉన్న చోటు సినిమా ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. పాప్‌కార్న్ లేకుండా సినిమా చూడటాన్ని మనం ఊహించుకోలేమంటూ చెప్పుకొచ్చారు.
తేజ కామెంట్స్ కు మెజారిటీ మూవీ లవర్స్ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తేజ కాంపౌండ్ నుంచి దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘అహింస’ (Ahimsa) టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.