Poorna | సీమ టపాకాయ్, అవును చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంది. త్వరలో జైలర్ 2 చిత్రంతో పలకరించనుంది. కేరళలోని కన్నూర్‌కు చెందిన పూర్ణ, 2004లో మలయాళ సినిమా మంజుపొలొరు పెన్కుట్టితో కెరీర్ మొదలెట్టింది. 2007లో శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తరువాత సీమటపాకాయ్ , అవును , లడ్డూబాబు , నువ్విలా నేనిలా, అవును 2 , రాజుగారి గది , మమ మంచు అల్లుడు కంచు , జయమ్ము నిశ్చయమ్మురా , సిల్లీ ఫెలోస్ , సుందరి , అఖండ , దృశ్యం2 , దసరా, భీమ్ వంటి హిట్ సినిమాల్లోను కీలక పాత్రలు పోషించి మెప్పించింది.
ప్రత్యేక పాటలలో కూడా అలరించింది. రాజాధిరాజా (తమిళం), శ్రీమంతుడు (తెలుగు), గుంటూరు కారం తదితర చిత్రాల్లో ఆమె పాటలు మాస్ హిట్ అయ్యాయి. టీవీ షోలలో కూడా పూర్ణ అదరగొట్టింది. సిక్త్స్ సెన్స్ , ఢీ వంటి షోలకు హోస్ట్‌గా మెరిసింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే , పూర్ణ దుబాయ్ వాణిజ్యవేత్త షనీద్ అసిఫ్ అలీ ని వివాహమాడింది. 2022లో వీరి వివాహం జరగగా, 2023 ఏప్రిల్ 10న పెద్దగా మగబిడ్డకు జన్మనిచ్చి కుటుంబంతో సంతోషంగా గడుపుతుంది. ఇటీవల పూర్ణ భర్త అసిఫ్ అలీ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయగా, అది వైరల్ అయింది. 45 రోజులుగా నరకం అనుభవిస్తున్నా. ఒంటరితనం భరించలేకపోయాను. నీ చిరునవ్వు, ప్రేమే నా బలం అని ఇప్పుడే గ్రహించా. పెళ్ళైన ఇన్నేళ్ళలో మేము ఎప్పుడూ ఇంత దూరంగా లేము అంటూ ఎమోషనల్ పోస్ట్ చెప్పాడు పూర్ణ భర్త.
ఇక పూర్ణ తాజాగా తన సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ శుభవార్తతో మా గుండెల్లో సంతోషం నిండింది. మా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారు. కొత్త నవ్వులు,చిన్ని చిన్ని అడుగు జాడలు మా జీవితాలలోకి రాబోతున్నాయి. ఈ సమయంలో శుభవార్తని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది అని తెలియజేస్తూ పూర్ణ రెండో సారి తల్లి కాబోతుందనే గుడ్ న్యూస్ చెప్పింది.ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, నెటిజన్స్ ఆమెకు విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్ణ ఇప్పుడు సినిమాల్లో తక్కువగా కనిపించినా, టీవీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది.