Poorna | ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది కేరళ కుట్టి పూర్ణ (షమ్నా ఖాసీమ్) (Poorna). ప్రముఖ బిజినెస్ మెన్ షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali)ని పెళ్లి చేసుకున్న పూర్ణ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సంతోషకరమైన విషయాన్ని పూర్ణ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా ఆస్పత్రి బెడ్‌పై తన కొడుకును ఒడిలో పెట్టుకుని వైద్య బృందంతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
కాగా ఇప్పుడు పూర్ణ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసింది. తన కుమారుడికి ఏం పేరు పెట్టారో చెప్పింది. తన కుమారుడికి హమ్దాన్ అసిఫ్ అలీ పేరు పెట్టినట్టు తెలియజేసింది పూర్ణ. తన భర్త పేరు కలిసొచ్చేలా కుమారుడికి నామకరణం చేసింది. ఈ క్రేజీ న్యూస్‌ను పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ దేవుడు ఆయురారోగ్యాలు, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. హమ్దాన్ అసిఫ్ అలీకి అల్లా దీవెనలుంటాయని మరికొందరు కామెంట్లు పోస్ట్ చేశారు.
పూర్ణ ప్రధాన పాత్రలో ఇటీవలే అసలు సినిమా కూడా విడుదలైంది. ఏప్రిల్ 13న ETV WIN appలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. పూర్ణ ప్రస్తుతం మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పిసాసు 2లో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఆస్పత్రిలో వైద్య బృందంతో ఇలా..