Poonam Kaur | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తిరుమల వెళ్లడంపై పరోక్షంగా విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది టాలీవుడ్ నటి పూనమ్ కౌర్. ఇప్పటికే ఈ భామ లడ్డూ విషయంలో దేవుడిని రాజకీయల్లోకి లాగారు అంటూ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. తన చిన్న కుమార్తె పొలెనా అంజనకి తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ తీసుకున్నాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. కూతుళ్లతో కలిసి పవన్ రాజకీయం చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం దర్శనం కోసం అధికారులు సాధారణ భక్తులను గంటల కొద్ది క్యూలో నిలబెట్టడం సరికాదంటున్నారు నెటిజన్స్.
అయితే పవన్ కళ్యాణ్ తన కూతుళ్లుతో దర్శనం చేసుకోవడంపై పూనమ్ కౌర్ పరోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ తిరుమల పర్యటన చేసిన నేపథ్యంలో ‘ప్రతి ఒక్కరికి కుమార్తె ముఖ్యమే’ అంటూ పూనమ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కూతుళ్లతో కలిసి పవన్ రాజకీయం చేస్తున్నాడని.. అందుకే పవన్ ఉద్దేశించే పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Everyone’s daughter is important !!!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 2, 2024