Poonam Kaur tweet on Bheemla Nayak | పూనమ్ కౌర్.. అప్పుడెప్పుడో 15 ఏండ్ల కింద ఇండస్ట్రీకి వచ్చింది. అరడజను సినిమాలకు పైగా నటించింది. కానీ గుర్తింపు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే వచ్చింది. కత్తి మహేశ్ ఉన్నప్పుడు ఎక్కువగా పూనమ్ పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తూ చాలా రచ్చ చేశాడు. దాంతో పాటు అప్పుడప్పుడూ పూనమ్ కూడా చేసిన కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలో సెన్సేషనల్ ట్వీట్ చేసింది. తాజాగా విడుదలైన భీమ్లా నాయక్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా కచ్చితంగా రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయం అయిపోయింది.
రాబోయే రెండు మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ సునామీ కనిపించడం పక్కా. ఇప్పటికే ఈ సినిమా చూసి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు. బండ్ల గణేశ్, లోకేశ్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన వాట్సాప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేసుకుంది. అందులో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన రివ్యూ చెబుతున్నాడు సినిమాకు వచ్చిన అక్క.. బావ సినిమా.. 8am… అంటూ ఫైర్ ఎమోజీస్ ఇచ్చాడు.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 25, 2022
ఇందుకు పూనమ్ సిగ్గు పడుతున్న ఎమోజీస్ షేర్ చేస్తూ.. నిజాయితీగా రివ్యూ చెప్పమని అడిగింది. సరే అక్క అంటూ అవతలి నుంచి రిప్లై వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ చాట్‌ను స్క్రీన్ షాట్ చేసింది. పూనమ్ షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో పవన్ ఇమేజ్ డామేజ్ చేయడానికి పూనమ్ ఈ ట్వీట్ చేసింది అంటున్నారు ఫ్యాన్స్. అక్క.. బావ అంటూ కావాలనే పవన్ పేరు బయట పెడుతున్నారు అని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.