ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు.అందం,అభినయం ఉన్న ఈ అమ్మడు వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ మిగతా హీరోయిన్స్‌కి అసూయ పుట్టిస్తుంది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది.
పూజా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విడుదలకు సిద్ధంగా కాగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి రానుంది. ఇక మహేష్‌తో ఓ సినిమా, తమిళంలో విజయ్ సరసన బీస్ట్ అనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూజా ఇన్‌స్టాగ్రాములో 15 మిలియన్స్ ఫాలోవర్స్ సొంతం చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయడమే కాక అప్పుడప్పుడు లైవ్ చిట్‌చాట్ నిర్వహిస్తు నిత్యం ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో పూజా ఇన్‌స్టాగ్రాములో 15 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చి చేరారు. దీంతో పూజా సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటోంది. తన హేర్ స్టైలిస్ట్, మేకప్ అర్టిస్ట్ కాజోల్, కుక్, అసిస్టెంట్, కుక్ అసిస్టెంట్స్లను కూడా తన సంతోషంలో భాగం చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది.
అందులో తన క్రేజీ టీంను పరిచయం చేసింది. వీరంతా నన్ను నవ్విస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంటారు. అందంగా కనిపించేలా కూడా చేస్తుంటారు అని పేర్కొన్న పూజా.. తను ఈ మైలు రాయి చేరుకోవడంలో సాయ పడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది పూజా.
On occasion of hitting 15 MILLION on Insta, i thought, let me introduce u to my crazy team, the ones tht have been with me frm after DJ to nw Beast. So grateful for this lot, u all make juggling 4 times at 1 time luk easy. Here goes…Team Pooja Hegde To my fans LOVE YOU SO MUCH❤️ pic.twitter.com/D8sEZXFblL
— Pooja Hegde (@hegdepooja) September 1, 2021