దాదాపు నాలుగేళ్లుగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉంది మంగళూరు సోయగం పూజాహెగ్డే. బాలీవుడ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. అయితే వరుస ఫెయిల్యూర్స్ దృష్ట్యా ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీపై దృష్టిపెడుతున్నది. ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆమెను కథానాయికగా ఖరారు చేశారు.
‘డీక్యూ 41’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సుజీత్ దర్శకత్వంలో నాని ‘బ్లడీ రోమియో’ అనే చిత్రంలో నటించబోతున్నారు. వేసవిలో ఈ సినిమా సెట్స్మీదకెళ్లనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది.
ఇందులో పూజాహెగ్డేను కథానాయికగా ఖరారు చేశారని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దళపతి విజయ్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటించిన ‘జన నాయగన్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.