అదృష్టం కంటే తాను హార్డ్‌వర్క్‌నే ఎక్కువగా నమ్ముతానని అంటున్నది పూజాహెగ్డే. తొలినాళ్లలో అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులను తాను ఎప్పటికీ మరచిపోలేనని చెప్పింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో అగ్రనాయికల్లో ఒకరిగా ఈ సొగసరి కొనసాగుతున్నది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె విరామంలో ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ‘కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. ఒక్క అవకాశం కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సివచ్చేది. నిరాశ చెందకుండా మనసుపెట్టి నిజాయితీగా శ్రమించా. మంచి కథలు లభించడం, అదృష్టం తోడవ్వడంతో అగ్ర స్థాయికి చేరుకున్నా. ఖాళీగా ఉండటం నాకు నచ్చదు. నిరంతరం పనిలో ఉండాలనే కోరుకుంటా. అందుకే బిజీ షెడ్యూల్స్‌లో అలసటగా ఎప్పుడూ ఫీలవ్వను. దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించాలన్నది నా చిరకాల కల. ఏదో ఒకరోజు ఆ కోరిక తీరుతుందనే నమ్మకముంది. షూటింగ్ వల్ల ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడేందుకు సంగీతం వింటుంటా. మ్యూజిక్ నా బెస్ట్ ఫ్రెండ్’ అని తెలిపింది. స్కూల్ డేస్‌లో ఫిజిక్స్, ఇంగ్లీష్ ఇష్టమైన సబ్జెక్ట్లని, మెస్సీ తన ఫేవరేట్ ఫుట్‌బాల్ ఆటగాడని పూజాహెగ్డే చెప్పింది.