Actress Pooja Hegde | మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ఆమె సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి పూజానే కావాలన్నారంటే ఆమె ఎంత లక్కీ చార్మో అర్థం చేసుకోవచ్చు. అయితే అదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. గత రెండేళ్లుగా పూజా సినీ కెరీర్ చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తర్వాత పూజా నటించిన ఆరు సినిమాలు పెవీలియన్ బాట పట్టాయి. సౌత్‌లో ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్‌కు వెళ్తే.. నార్త్‌లో కూడా ఇదే పరిస్థితి. గంపెడంతో ఆశలు పెట్టుకున్న ‘సర్కస్’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇక ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సైతం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఇవన్నీ పక్కన పెట్టేస్తే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవడం మరింత నిరాశకు గురి చేసింది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉందని ఇన్సైడ్. అయితే కారణాలేంటో పక్కాగా తెలియదు కానీ.. పూజా హఠాత్తుగా ఈ సినిమా నుంచి తప్పకుంది. ఇప్పుడు ఆమె ప్లేస్‌ను శ్రీలీల రీప్లెస్ చేసింది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు పూజాకు అడ్వా్న్స్ రూపంలో కొంత డబ్బులు అప్పుడే ఇచ్చేసిందట. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో పూజా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అయితే త్రివిక్రమ్ దానికి బుదులుగా ఓ ఐటెం సాంగ్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. దానికి పూజా కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక గుంటూరు కారం విషయానికొస్తే.. ఏడాదినర్థం కిందటే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ ఇప్పటివరకు హాఫ్ షూటింగ్‌ను కూడా పూర్తి చేయలేదని టాక్. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు జరిగినన్ని మార్పులు బహుశా ఏ సినిమాకు జరగలేదెమో. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఓ కీలక షెడ్యూల్‌ను జరుపుకుంటుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు.